హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం పోస్ట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈ మేరకు వారు ఒక ప్రకటన విడుదల చేశారు. “తప్పుడు సమాచారంతో పాటు ప్రజలను అపోహలకు గురిచేసేలా వీడియోలు పోస్ట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం” అని తెలిపారు. అల్లు అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగినట్లు కొందరు తప్పుడు వీడియోలు పోస్ట్ చేసిన విషయం వారి దృష్టికి వచ్చింది. ఈ ఘటనపై విచారణ క్రమంలో, పోలీసులు నిజాలను వీడియో రూపంలో ప్రజలకు అందించారు. “ఉద్దేశపూర్వకంగా పోలీసు శాఖను బద్నాం చేసేలా తప్పుడు పోస్ట్లు పెడితే, దీనిని తీవ్రంగా పరిగణిస్తాం” అని నగర పోలీసులు పేర్కొన్నారు.ఈ ఘటనకు సంబంధించి ఏ పౌరుడి దగ్గరైనా ఆధారాలు లేదా అదనపు సమాచారం ఉంటే, దయచేసి పోలీసులకు అందించమని వారు కోరారు.





