నాకైతే వరుణ్‌ చక్రవర్తే ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’.. తను లేకపోతే కథ వేరే!!: అశ్విన్

భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్‌ చక్రవర్తిని అవార్డుకు ఎంపిక చేయాల్సిందని అశ్విన్ అభిప్రాయం.. ‘‘అతడు లేకపోతే భారత గేమ్‌ మరోలా ఉండేదేమో’’ – యూట్యూబ్‌ చానల్‌లో వ్యాఖ్య

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా టీమ్‌ఇండియా నిలవగా, న్యూజిలాండ్‌ ఆటగాడు రచిన్‌ రవీంద్ర ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’గా ఎంపికయ్యాడు. అయితే, టీమ్‌ఇండియా మాజీ ఆల్‌రౌండర్ రవిచంద్రన్‌ అశ్విన్ దీనిపై విభిన్న అభిప్రాయం వ్యక్తం చేశాడు. వరుణ్‌ చక్రవర్తే ఈ అవార్డుకు అర్హుడు అని పేర్కొన్నాడు. తన ‘యాష్‌ కి బాత్‌’ యూట్యూబ్‌ షోలో అశ్విన్ మాట్లాడుతూ, ‘‘నా దృష్టిలో ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్ వరుణ్‌ చక్రవర్తే. అతడు మొత్తం టోర్నీ ఆడకపోయినా, ఆడిన మ్యాచ్‌ల్లో పెనుప్రభావం చూపించాడు. అతడి లేని భారత గేమ్‌ వేరేలా ఉండేదేమో..! గ్లెన్‌ ఫిలిప్స్‌ను ఔట్‌ చేసిన తీరు అద్భుతం. నేనే జడ్జీనైతే ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు వరుణ్‌కే ఇచ్చేవాడిని’’ అని ప్రశంసించాడు. ఫైనల్‌ మ్యాచ్‌లో వరుణ్‌ను ముందుగానే బౌలింగ్‌కు ఎందుకు తీసుకురాలేదని అశ్విన్‌ ఓ ట్వీట్‌ చేయగా, దీనిపై అభిమానులు విమర్శలు చేశారు. ‘‘నా ట్వీట్‌ను కెప్టెన్సీపై కామెంట్‌గా భావించడం ఆశ్చర్యపరిచింది. అది కేవలం మ్యాచ్‌లో ఒత్తిడి ఎలా మారిందో చెప్పడానికే’’ అని వివరణ ఇచ్చాడు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *