🔸 జనవరి 1, 2026 నుంచి కేంద్రం కీలక నిర్ణయం
🔸 ప్రమాదాలు తగ్గించేందుకే కొత్త నిబంధన
🔸 ధరలపై ప్రభావం ఉండే అవకాశం
రోడ్డు ప్రమాదాల్లో పెద్దపీటని వేసే ద్విచక్ర వాహనాల భద్రతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 150సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న బైకులకు తప్పనిసరిగా ఉండే ఏబీఎస్ (యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్) ను ఇకపై అన్ని టూవీలర్లకూ వర్తింపజేయనుంది. అంటే, ఎంట్రీ లెవల్ బైకులు, స్కూటర్లు కూడా తప్పించుకోలేవు. ఈ నిబంధన 2026 జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. ఇప్పటికే తగినంతలో ప్రాథమిక చర్చలు పూర్తి కాగా, త్వరలోనే కేంద్ర రవాణా శాఖ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఏబీఎస్ అమలు వల్ల ఉత్పత్తి ఖర్చు పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. దీని ప్రభావంగా ఎంట్రీ లెవల్ బైకుల ధరలు రూ.2,500 నుంచి రూ.5,000 వరకు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే, ఈ ధర పెరుగుదలతో భద్రతా ప్రమాణాలు మెరుగవుతాయనే అభిప్రాయం పరిశ్రమలో ఉంది.
ఏబీఎస్ అంటే ఏంటి?
ఏబీఎస్ వ్యవస్థ సడన్ బ్రేక్ వేస్తే టైర్లు లాక్ కాకుండా, వాహనం స్కిడ్ కాకుండా అడ్డుకుంటుంది. అంటే, బ్రేక్ వేసినప్పుడు కూడా వాహనం మీద డ్రైవర్‌కి నియంత్రణ ఉంటుంది. వర్షం, జారుడు నేలపై ప్రయాణాల్లో ఇవి భద్రతగా మారవచ్చు.





