అన్నమయ్య జిల్లాలో దారుణం: ప్రేమ విఫలంతో యువతిపై యాసిడ్ దాడి!!

  • ప్రేమించిన యువతికి వివాహం నిశ్చయించడంతో దాడికి పాల్పడిన గణేష్
  • గాయాలపాలైన బాధితురాలి ఆరోగ్యం ఆందోళనకరం, చికిత్స ఖర్చు భరిస్తామని మంత్రి హామీ

అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం ప్యారంపల్లెలో దారుణం చోటుచేసుకుంది. గణేష్ అనే యువకుడు ప్రేమించిన యువతిపై యాసిడ్ దాడి చేశాడు. ఆమెకు వేరే వ్యక్తితో వివాహం నిశ్చయించడంతో కోపోద్రిక్తుడై ఆమె తలపై కత్తితో గాయపరిచి, ముఖంపై యాసిడ్ పోశాడు. తీవ్ర గాయాలపాలైన యువతిని మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించగా, మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు. పోలీసులు నిందితుడు గణేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. దాడి తర్వాత అతను ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం. బాధితురాలిని మదనపల్లి ఆసుపత్రిలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పరామర్శించి, మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం అన్ని సహాయాలు చేస్తుందని హామీ ఇచ్చారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (365 x 270 area)
Breaking News
కేటగిరి

మా న్యూస్ అప్డేట్లు కోసం సబ్‌స్క్రైబ్ చేయండి!

Everyday we discover real news for you.