అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్‌: కీలక ముందడుగు.. 189.4 కిలోమీటర్ల ఆరు వరుసల కంట్రోల్‌ రోడ్డు!!

అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్‌ (ఓఆర్‌ఆర్‌) ప్రాజెక్టుకు కేంద్ర రవాణా మంత్రిత్వశాఖ ప్రాథమిక ఆమోదం లభించింది. 189.4 కిలోమీటర్ల ఆరు వరుసల యాక్సెస్‌ కంట్రోల్‌ రోడ్‌ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనను కమిటీ ఆమోదించింది. తూర్పు బైపాస్‌ అవసరం లేదని స్పష్టం చేయడంతో పాటు నాలుగు చోట్ల ఎలైన్‌మెంట్‌లో స్వల్ప మార్పులు చేయాలని సూచించింది. ఈ ప్రాజెక్టుకు రూ. 16,310 కోట్ల వ్యయం అంచనా వేయగా, రాష్ట్ర జీఎస్టీ మినహాయింపు వంటి రాయితీలు వల్ల ఖర్చు రూ. 15,154 కోట్లకు తగ్గనుంది.

భవిష్యత్తు అభివృద్ధికి ప్రణాళికలు

ఓఆర్‌ఆర్‌ నిర్మాణానికి 70 మీటర్ల వెడల్పు భూసేకరణ సరిపోతుందని కమిటీ తెలిపింది. భూముల వినియోగం నియంత్రించాలని సూచిస్తూ, 500 మీటర్ల పరిధిలో భూ లావాదేవీలను నిలిపివేయాలని రాష్ట్రప్రభుత్వానికి సూచనలు ఇచ్చింది. పశ్చిమ బైపాస్‌ను ఓఆర్‌ఆర్‌తో అనుసంధానం చేసేందుకు 18 కి.మీ. మేర రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. రింగ్‌రోడ్‌కు లోపల సర్వీస్‌ రోడ్ల నిర్మాణాన్ని మాత్రమే పరిశీలించవచ్చని కమిటీ అభిప్రాయపడింది.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (365 x 270 area)
Breaking News
కేటగిరి

మా న్యూస్ అప్డేట్లు కోసం సబ్‌స్క్రైబ్ చేయండి!

Everyday we discover real news for you.