ఆండ్రాయిడ్ లో హాట్ ఫీచర్: మీరే అని ఏంటి ఫ్రూఫ్? కొత్త వెర్షన్ లో ఐడెంటిటీ చెక్!!

ఒకప్పుడు పర్సు.. సూట్ కేస్.. లాంటివి పోతాయోమోనని ఎప్పటికప్పుడు చెక్ చేసుకునే వాళ్లం. ఇప్పుడు? ఎప్పటికప్పుడు జేబు చెక్ చేసుకుంటున్నాం.. ఫోన్ ఉందో? లేదో? అని. ఇంతలా స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైన వస్తువులా మారిపోయింది. అందుకే స్మార్ట్ ఫోన్ సెక్యూరిటీ విషయంలో తయారీ సంస్థలు కూడా ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతున్నాయి.  ఓఎస్ లో అందుకు తగిన స్మార్ట్ ఫీచర్లను జోడిస్తున్నాయి.  ఆండ్రాయిడ్ త్వరలో అందుబాటులోకి రానున్న  15 వెర్షన్ లోనూ ఫోన్ సెక్యూరిటీకి పెద్దపీట వేసింది. సెక్యూరిటీ విషయంలో ఆండ్రాయిడ్ ఫోన్ లకు ఏ మాత్రం తగ్గకుండా ‘ఐడెంటిటి చెక్’ ఫీచర్ ని పరిచయం చేయనుంది.  ఐఓఎస్ లో ఉన్న ‘స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్’ లాంటిదే ఈ ఫీచర్. 

ఇదెలా పని చేస్తుందంటే.. ఓ నిఘా వ్యవస్థ. వినియోగదారుడు ఫోన్ ని రోజూ ఏయే లొకేషన్స్ లో వాడుతున్నాడు? ఏయే అవసరాలకు వాడుతున్నాడు?  ఏ వేళల్లో ఎక్కువగా వాడుతున్నాడు?… లాంటి అనేక విషయాల్ని నిత్యం ట్రాక్ చేస్తుంది. ఎప్పుడైనా అనుకోకుండా ఫోన్ ఏదైనా కొత్త లొకేషన్ ని డిటెక్ట్ చేస్తే.. వెంటనే అలర్ట్ అవుతుంది.  వెంటనే యూజర్ ఎవరనేది తెలుసుకునేందుకు ఫోన్ లాక్ చేస్తుంది. యూజర్ బయోమెట్రిక్ లేదా ఫేస్ డిటెక్షన్ ని అడుగుతుంది.  వచ్చిన ఇన్ పుట్స్ ని ప్రాసెస్ చేసి యూజర్ వెరిఫికేషన్ చేశాకే.. అన్ లాక్ అవుతుంది.  ఇదెంత స్ట్రాంగ్ గా పని చేస్తుందంటే.. పిన్ నెంబర్ లో ఫోన్ ని అన్ లాక్ చేసినా కూడా.. ‘ఐడెంటిటీ చెక్’ తర్వాత అన్ లాక్ అవుతుంది.   దీంతో ఎవరైనా ఫోన్ దొంగిలిస్తే.. డేటా ఎవరి కంటా పడకుండా జాగ్రత్త పడొచ్చు అన్నమాట.  మరో విషయం ఎంటంటే.. కొత్త వెర్షన్ ఆండ్రాయిడ్ 15లో కస్టమైజేషన్ ని అధిక ప్రాధాన్యతనిస్తూ ఫీచర్లను అందుబాటులోకి తెస్తున్నారట. దీంతో యూజర్ల వారి వారి అవసరాలకు తగినట్టుగా ఓఎస్ లో మార్పులు చేసుకోవచ్చు. 

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *