- బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పారిశ్రామికవేత్తలకు పెట్టుబడి రాయితీ 45%కు పెంపు
- నీరు-చెట్టు పెండింగ్ బిల్లుల చెల్లింపుకు ఆమోదం.. పారిశ్రామిక ప్రోత్సాహకాలకు భారీ రాయితీలు
రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, విభిన్న ప్రతిభావంతులు, మహిళా పారిశ్రామికవేత్తలకు పెట్టుబడి రాయితీ 35% నుండి 45%కి పెంచుతూ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఉత్పత్తి రంగంతో పాటు రవాణా, లాజిస్టిక్స్‌కు కూడా రూ.75 లక్షల వరకు రాయితీ వర్తించనుంది. విద్యుత్తు రాయితీని ఐదేళ్లపాటు ప్రతి యూనిట్‌కు రూ.1.50 చొప్పున పెంచాలని నిర్ణయించారు. నీరు-చెట్టు పథకం కింద పెండింగ్ బిల్లుల చెల్లింపునకు మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం రూ.50.56 కోట్ల బిల్లులను విడుదల చేయనుంది. తితిదేలో 15 పోటు వర్కర్లను సూపర్‌వైజర్లుగా ప్రమోట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు
34 ప్రాజెక్టులకు రూ.6.78 లక్షల కోట్ల పెట్టుబడులు రానుండగా, వీటితో 4.28 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. పలు పారిశ్రామిక ప్రాజెక్టులకు భూమి కేటాయింపులు, సౌర విద్యుత్తు ప్రాజెక్టుల ఆమోదం కూడా మంత్రిమండలిలో జరిగింది.





