- ప్రజల కోసం వ్యయానికి లోటు లేకుండా బడ్జెట్ – చంద్రబాబు
- ఎమ్మెల్యేలు, ఎంపీలు సమన్వయంతో పనిచేయాలని సూచన
ఆంధ్రప్రదేశ్ 2025-26 బడ్జెట్ ప్రజా సంక్షేమం, అభివృద్ధికి సంబంధించినదే అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అసెంబ్లీ కమిటీ హాల్‌లో టీడీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎంపీలతో చర్చించారు. బడ్జెట్‌ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. టీడీపీ పాలన ప్రజల నమ్మకాన్ని తిరిగి పొందిందని, గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని చంద్రబాబు ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కాలంటే ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపరచాలి అని స్పష్టం చేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయం ఉండాలనీ, గ్రూపు రాజకీయాలను సహించబోమని తేల్చి చెప్పారు.





