“ఉత్సాహం తారాస్థాయికి: క్రీడల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దుమ్మురేపారు!”

  • 80 ఏళ్ల బుచ్చయ్యచౌదరి 100 మీటర్ల పరుగు పందెంలో పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచారు
  • క్రికెట్ ఫైనల్‌లో మంత్రి నాదెండ్ల మనోహర్ టీం విజయం సాధించింది

అమరావతిలో జరుగుతున్న శాసనసభ్యుల క్రీడా పోటీలు రెండో రోజూ ఉత్సాహంగా కొనసాగాయి. ఎప్పుడూ సభలో చురుగ్గా ఉండే ప్రజాప్రతినిధులు మైదానంలోనూ తమ సత్తా చాటారు. 80 ఏళ్ల వయసులోనూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి 100 మీటర్ల పరుగు పందెంలో లక్ష్యాన్ని చేరుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. షాట్‌పుట్ విసరడంలో పురుషుల విభాగంలో కామినేని శ్రీనివాస్, మహిళల విభాగంలో పల్లె సింధూరరెడ్డి మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు.

క్రికెట్‌లో సెన్సేషన్

క్రికెట్ ఫైనల్‌లో మంత్రి నాదెండ్ల మనోహర్ జట్టు అద్భుత ప్రదర్శనతో విజయం సాధించింది. చివరి ఓవర్లలో టైటుగా బౌలింగ్, ఫీల్డింగ్‌తో ప్రత్యర్థులను కట్టడి చేస్తూ 34 పరుగుల తేడాతో మంత్రి సత్యకుమార్ టీంపై గెలిచింది. కీపర్‌గా మనోహర్ రెండు స్టంపింగ్‌లు, ఓ క్యాచ్‌తో మ్యాచ్‌ను మార్చేశారు. ఎమ్మెల్యే శ్రీధర్ రెండు కీలక క్యాచ్‌లు పట్టి జట్టు విజయానికి తోడ్పడ్డారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *