భారీ స్కోరుతో ఆసీస్ విజయం – సచిన్ మెరుపులు వృథానే!!

  • షేన్ వాట్సన్, బెన్ డంక్‌ శతకాలతో ఆసీస్‌ అద్భుత విజయంపైన
  • సచిన్ హాఫ్‌ సెంచరీ వృథా – 95 పరుగుల తేడాతో ఇండియా ఓటమి

ఇంటర్నేషనల్ మాస్టర్స్ టీ20 లీగ్‌లో భారత్ మాస్టర్స్‌ జోరుకు ఆస్ట్రేలియా మాస్టర్స్‌ కళ్లెం వేసింది. బుధవారం వడోదర వేదికగా జరిగిన మ్యాచ్‌లో 95 పరుగుల తేడాతో భారత్ ఓటమిని చవిచూసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా మాస్టర్స్‌ 20 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 269 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. కెప్టెన్ షేన్ వాట్సన్‌ (110) – బెన్ డంక్‌ (132) అజేయ సెంచరీలతో చెలరేగి భారత బౌలింగ్‌ను చిత్తు చేశారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 236 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

సచిన్‌ పోరాటం వృథా

270 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత బ్యాటర్లు విఫలమయ్యారు. కెప్టెన్ సచిన్ టెండూల్కర్‌ 33 బంతుల్లో 64 పరుగులు (7 ఫోర్లు, 4 సిక్సులు) సాధించినా, మిగతా బ్యాటర్లు నిలవలేకపోయారు. యూసఫ్‌ పఠాన్‌ (25) మినహా మరెవ్వరూ రాణించలేకపోయారు. భారత్ 174 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్‌ బౌలర్లలో జేవియర్ డోహెర్టీ 5 వికెట్లు తీసి భారత బ్యాటింగ్‌ను దెబ్బతీశాడు. ఈ ఓటమితో భారత్‌ టోర్నీలో తొలి పరాజయాన్ని ఎదుర్కొంది. జట్టు తన తదుపరి మ్యాచ్‌లో మార్చి 8న వెస్టిండీస్‌తో తలపడనుంది.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (365 x 270 area)
Breaking News
కేటగిరి

మా న్యూస్ అప్డేట్లు కోసం సబ్‌స్క్రైబ్ చేయండి!

Everyday we discover real news for you.