వాంఖడేలో అభిషేక్‌ శర్మ విజృంభణ – రికార్డుల మోత!! 37 బంతుల్లో రెండో సెంచరీ!!

  • 37 బంతుల్లో టీ20 సెంచరీ – భారత్ తరపున అత్యధిక వ్యక్తిగత స్కోర్
  • 13 సిక్సర్లతో కొత్త రికార్డు – ఇంగ్లండ్‌పై వేగవంతమైన శతకం

వాంఖడే స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టీ20లో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ తన ఆటతో సంచలనం రేపాడు. 37 బంతుల్లోనే తన రెండో టీ20 సెంచరీ పూర్తి చేసుకున్న అభిషేక్, 54 బంతుల్లో 135 పరుగులు చేశాడు. 7 ఫోర్లు, 13 సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లను భయపెట్టాడు. జోఫ్రా ఆర్చర్‌, మార్క్ ఉడ్‌ల వంటి వరల్డ్‌క్లాస్‌ బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్నాడు. బ్యాటింగ్‌తోనే కాకుండా బౌలింగ్‌లోనూ తన మార్క్ చూపించాడు, రెండు వికెట్లు పడగొట్టాడు. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో భారత తరపున అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ రికార్డు ఇప్పటి వరకు శుభ్‌మన్‌ గిల్‌ (126 పరుగులు) పేరిట ఉండేది.

కొత్త రికార్డులు బ్రేక్ అయ్యాయ్!!

  • టీ20ల్లో భారత్ తరపున అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన రెండో ఆటగాడు (రోహిత్‌ శర్మ 35 బంతుల్లో 2017లో శ్రీలంకపై శతకం)
  • అంతర్జాతీయ టీ20లో భారత బ్యాటర్‌గా అత్యధిక సిక్సులు – 13 సిక్సులతో రోహిత్‌ శర్మ (10 సిక్సులు, 2017) రికార్డును బ్రేక్‌
  • ఇంగ్లండ్‌పై అత్యంత వేగవంతమైన శతకం – 37 బంతుల్లో సెంచరీ, గత రికార్డు ఆరోన్‌ ఫించ్‌ (47 బంతులు) పేరిట

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *