- బర్డ్ ఫ్లూ అపోహలను తొలగించేందుకు అవగాహనా కార్యక్రమాలు
- ఏలూరులో చికెన్ మేళా – ప్రజలలో భయాలు పోగొట్టేందుకు ప్రత్యేక వంటకాలు
రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ అమ్మకాలు గణనీయంగా తగ్గిపోవడంతో, ప్రజల అపోహలను నివృత్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం, పౌల్ట్రీ ఫెడరేషన్ అవగాహనా కార్యక్రమాలు చేపట్టింది. ఈ క్రమంలోనే ప్రత్యేకంగా చికెన్ ఫుడ్ మేళాలను నిర్వహిస్తోంది.
చికెన్ మేళాలో అవగాహన
ఈ అవగాహన కార్యక్రమాల్లో భాగంగా ఏలూరులోని అల్లూరి సీతారామరాజు స్టేడియంలో ప్రత్యేక చికెన్ మేళాను నిర్వహించారు. ఇందులో పౌల్ట్రీ ఫామ్ యాజమానులు, చికెన్ వ్యాపారస్తులు, పశుసంవర్థక శాఖ అధికారులు కలిసి పాల్గొన్నారు. ప్రజల్లో అపోహలు తొలగించేందుకు చికెన్, గుడ్లతో తయారైన ప్రత్యేక వంటకాలను ప్రదర్శించారు. పౌల్ట్రీ నిపుణులు, అధికారులు “చికెన్, గుడ్లు తినడం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావు” అని స్పష్టం చేశారు. వాటిలో ప్రోటీన్, పోషకాలు సమృద్ధిగా ఉండేలా ఎటువంటి ఇన్ఫెక్షన్ల ప్రభావం ఉండదని వివరించారు. చికెన్ మేళాలో ప్రత్యేకంగా తయారు చేసిన వంటకాలను ప్రజలు రుచిచూడటానికి పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పశు సంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ టి. గోవిందరాజు, పౌల్ట్రీ వ్యాపారులు, చికెన్ దుకాణాల యజమానులు పాల్గొన్నారు.






