ఫార్ములా-ఈ కేసులో కేటీఆర్‌ క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు రేపే!!

ఫార్ములా-ఈ రేసుల కేసులో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు నేడు (జనవరి 7) తుది తీర్పు ఇవ్వనుంది. గతంలో ఈ కేసులో వాదనలు పూర్తి చేసిన కోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. విచారణ జరుగుతున్న సమయంలో కేటీఆర్‌ను అరెస్ట్‌ చేయరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు తీర్పు ప్రకటించనున్న నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది.

కేటీఆర్‌ పై కేసు వివరాలు
ఈ కేసులో కేటీఆర్‌ ఏ1గా ఉన్నారు. హైకోర్టు ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్‌ చేస్తే కేటీఆర్‌కు శాశ్వత ఊరట లభించే అవకాశం ఉంది. అయితే ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) విచారణకు హాజరుకావాలని కేటీఆర్‌కు గతంలో నోటీసులు జారీ చేసింది. క్వాష్‌ పిటిషన్‌ తీర్పు రిజర్వ్‌లో ఉండటంతో విచారణకు హాజరు కావలేమని కేటీఆర్‌ తన సమాధానంలో తెలిపారు. ఇక ఏసీబీ (ఆంటీ కరప్షన్‌ బ్యూరో) కూడా ఈ కేసులో కేటీఆర్‌కు విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. సోమవారం బంజారాహిల్స్‌ ఏసీపీ కార్యాలయానికి వెళ్లిన కేటీఆర్‌ న్యాయవాదిని అనుమతించనందున అక్కడి నుంచి వెనుతిరిగారు. రేపు హైకోర్టు తీర్పు అనేక రాజకీయ పరిణామాలకు దారితీయవచ్చు. ఎఫ్‌ఐఆర్‌ క్వాష్‌ అయితే కేసు నుంచి బయటపడినట్లవుతుందనేది వాదన. దీనిపై టీఆర్‌ఎస్‌ వర్గాలు హైకోర్టు తీర్పును ఆశగా ఎదురు చూస్తున్నాయి.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (365 x 270 area)
Breaking News
కేటగిరి

మా న్యూస్ అప్డేట్లు కోసం సబ్‌స్క్రైబ్ చేయండి!

Everyday we discover real news for you.