- కొత్త ఉడాన్ పథకం: మరో 120 రూట్లలో అమలు
- 10 ఏళ్లలో లక్ష్యం: 4 కోట్ల మంది విమాన ప్రయాణం
- బిహార్‌లో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు ఏర్పాటు
- కృత్రిమ మేధ అభివృద్ధికి ₹500 కోట్లతో మూడు ప్రత్యేక కేంద్రాలు
- క్లీన్‌టెక్ మిషన్ కింద సోలార్, ఈవీ, బ్యాటరీ పరిశ్రమలకు ప్రోత్సాహం
- పరిశ్రమల అభివృద్ధికి నేషనల్ మానుఫ్యాక్చరింగ్ మిషన్
- రాష్ట్రాలకు ₹1.5 లక్షల కోట్ల రుణాలు
- 50 ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు
- మహిళలు, ఎస్సీ, ఎస్టీ వ్యాపారవేత్తలకు ₹2 కోట్ల టర్మ్ లోన్
కేంద్ర బడ్జెట్‌లో ‘ఉడాన్’ పథకాన్ని మరింత విస్తరించి మరో 120 రూట్లలో అమలు చేయనుంది. 10 ఏళ్లలో 4 కోట్ల మంది విమాన ప్రయాణం అందుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం విమానయాన రంగాన్ని మరింత విస్తరిస్తోంది. ఇక బిహార్‌లో కొత్త గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది.దేశంలో AI అభివృద్ధికి మూడు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయనున్న కేంద్రం. ఇందుకోసం ₹500 కోట్ల నిధులు కేటాయించనుంది. క్లీన్‌టెక్ మిషన్ కింద సోలార్, ఈవీ, బ్యాటరీ పరిశ్రమలకు ప్రోత్సాహం అందించనుంది. అలాగే, పరిశ్రమల అభివృద్ధికి నేషనల్ మానుఫ్యాక్చరింగ్ మిషన్‌ను ప్రవేశపెట్టింది. ₹1.5 లక్షల కోట్ల రుణాలు రాష్ట్రాలకు మంజూరు చేయనున్న కేంద్రం. మూలధన వ్యయాల కోసం 50 ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు అందించనుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక వ్యాపారవేత్తలకు ₹2 కోట్ల టర్మ్ లోన్ అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.






