- చిరంజీవి కథానాయకుడిగా నాని నిర్మించనున్న సినిమా త్వరలో ప్రారంభం
- దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ‘ప్యారడైజ్’ పూర్తయిన వెంటనే ఈ ప్రాజెక్ట్‌కు శ్రీకారం
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నాని నిర్మించనున్న చిత్రంపై అధికారిక అప్‌డేట్ వచ్చేసింది. ‘దసరా’ ఫేం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించే ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ వచ్చే ఏడాది ప్రారంభం కానుందని నాని వెల్లడించారు. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల, నాని కాంబినేషన్‌లో ‘ప్యారడైజ్’ సినిమా తెరకెక్కుతోంది. ఆ సినిమా పూర్తయిన వెంటనే చిరు మూవీ పట్టాలెక్కనుంది. ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’ షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ చిత్రాన్ని సమ్మర్‌లో విడుదల చేయాలని టీం ప్లాన్ చేస్తోంది. అనంతరం అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. ఇక నాని విషయానికి వస్తే.. ఆయన సమర్పణలో ‘కోర్ట్’ సినిమా మార్చి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ప్రచార కార్యక్రమాల్లో భాగంగా నాని, చిరు సినిమాపై ఆసక్తికర అప్‌డేట్ ఇచ్చారు.





