- పండుగల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే 22 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.
- ఈ రైళ్లు సెప్టెంబర్ 4 నుంచి అక్టోబర్ 4 వరకు అందుబాటులో ఉంటాయి.
- సికింద్రాబాద్, తిరుపతి, కాచిగూడ, నాగర్‌సోల్, చర్లపల్లి వంటి రూట్లలో ఈ సేవలు లభిస్తాయి.
రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. దసరా, దీపావళి పండుగల సందర్భంగా సొంతూళ్లకు వెళ్లేవారి కోసం ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ పండుగల రద్దీని దృష్టిలో పెట్టుకుని మొత్తం 22 ప్రత్యేక రైళ్లు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ఓ శ్రీధర్ తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లు సెప్టెంబర్ 4 నుంచి ప్రారంభమై, అక్టోబర్ 4 వరకు సేవలు అందిస్తాయి.
ఈ రూట్లలో రైళ్లు
- సికింద్రాబాద్ – తిరుపతి రూట్: సికింద్రాబాద్ – తిరుపతి మధ్య 4 ప్రత్యేక సర్వీసులు (సెప్టెంబర్ 4 నుంచి 25 వరకు). తిరుపతి – సికింద్రాబాద్ మధ్య 4 ప్రత్యేక సర్వీసులు (సెప్టెంబర్ 5 నుంచి 26 వరకు).
- కాచిగూడ – నాగర్‌సోల్ రూట్: కాచిగూడ – నాగర్‌సోల్ మధ్య 4 ప్రత్యేక సర్వీసులు (సెప్టెంబర్ 4 నుంచి 25 వరకు). నాగర్‌సోల్ – కాచిగూడ మధ్య 4 ప్రత్యేక సర్వీసులు (సెప్టెంబర్ 5 నుంచి 26 వరకు).
- సంత్రాగ్జి – చర్లపల్లి రూట్: సంత్రాగ్జి – చర్లపల్లి మధ్య 3 ప్రత్యేక సర్వీసులు (సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 3 వరకు). చర్లపల్లి – సంత్రాగ్జి మధ్య 3 ప్రత్యేక సర్వీసులు (సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 4 వరకు).





