భయానక భూకంపం – మయన్మార్, థాయ్‌లాండ్‌లో 1000కుపైగా మృతి

  • 1002 మంది మరణించినట్లు మయన్మార్ మిలిటరీ వెల్లడి
  • భవనాలు కూలి బ్యాంకాక్‌లో 100 మందికి పైగా గల్లంతు

శుక్రవారం మయన్మార్‌, థాయ్‌లాండ్‌లను తీవ్ర భూకంపాలు వణికించాయి. మయన్మార్ మిలిటరీ తెలిపిన వివరాల ప్రకారం, 1002 మంది మరణించగా, 2370 మంది తీవ్రంగా గాయపడ్డారు. బ్యాంకాక్‌లో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఓ భారీ భవనం కూలిపోవడంతో 100 మంది కూలీలు గల్లంతయ్యారు. అమెరికా ఏజెన్సీ ప్రకారం, మృతుల సంఖ్య 10,000 దాటే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

సహాయ చర్యలు – ప్రపంచ దేశాల మద్దతు

భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. భారత్ ‘ఆపరేషన్ బ్రహ్మ’ కింద 15 టన్నుల సహాయక సామగ్రిని మయన్మార్‌కు పంపింది. అమెరికా, చైనా, ఇండోనేషియా కూడా సహాయం అందిస్తామని ప్రకటించాయి. ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ సహాయ చర్యల్లో తోడ్పడుతున్నట్లు వెల్లడించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు రెస్క్యూ టీములు నిరంతరం శ్రమిస్తున్నాయి.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *