తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాలు దట్టమైన పొగమంచుతో నిండిపోయాయి. ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి ప్రధాన నగరాల్లో మంచు ప్రభావం కనిపిస్తోంది. దీనివల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో హయత్‌నగర్, పెద్ద అంబర్‌పేట్, అబ్దుల్లాపూర్‌మెట్ వంటి ప్రాంతాల్లో పొగమంచు ప్రభావం అధికంగా ఉంది. హైదరాబాద్-విజయవాడ హైవేపై విజిబిలిటీ తగ్గిపోవడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఈ క్రమంలో వాహనదారులు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
విజయవాడలో విమాన రాకపోకలకు ఆటంకం
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని దట్టమైన పొగమంచు కప్పేయడంతో రాకపోకలు తీవ్రంగా ఆలస్యమవుతున్నాయి. రన్‌వే విజిబులిటీ లేక గాల్లో ఇండిగో విమానం చక్కర్లు కొట్టడం గమనార్హం.






