కంగనా ‘ఎమర్జెన్సీ’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్!

  • కంగనా స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘ఎమర్జెన్సీ’.
  • నెట్‌ఫ్లిక్స్‌లో మార్చి 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘ఎమర్జెన్సీ’ జనవరి 17న థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందనలు పొందింది. కంగన తాజాగా ఈ చిత్రం ఓటీటీ వేదికగా మార్చి 17 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుందని ప్రకటించారు. ఈ చిత్రాన్ని మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితాన్ని ఆధారంగా చేసుకొని రూపొందించారు. కంగనా ఇందిరాగాంధీగా నటించగా, అనుపమ్ ఖేర్ జయప్రకాష్ నారాయణ్ పాత్రలో, శ్రేయాస్ తల్పడే అటల్ బిహారీ వాజ్‌పేయిగా కనిపించనున్నారు. రూ.60 కోట్లతో రూపొందించబడిన ఈ చిత్రం రూ.21 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ‘ఎమర్జెన్సీ’ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *