- దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తెస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ నటి
- స్మగ్లింగ్ వెనుక రాజకీయ నేతల హస్తం ఉందన్న అనుమానాలు
దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం స్మగ్లింగ్ చేస్తూ కన్నడ నటి రన్యా రావు పట్టుబడడం సంచలనంగా మారింది. బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో 14.2 కిలోల బంగారంతో అర్ధరాత్రి దొరికిపోయిన ఆమె నివాసంలో పోలీసులు తనిఖీలు నిర్వహించగా రూ.17.29 కోట్ల విలువైన బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో ఈ స్మగ్లింగ్ వెనుక ఓ ప్రముఖ రాజకీయ నేత ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బెంగళూరులోని ఓ జువెల్లరీ బొటిక్ నుంచి ఆమె బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక, రన్యా గత ఏడాదిలో 30 సార్లు దుబాయ్‌కి వెళ్లొచ్చినట్లు గుర్తించారు. ప్రతి కిలో బంగారం స్మగ్లింగ్‌కు రూ.లక్ష చొప్పున కమిషన్ తీసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసుపై కర్ణాటక సీఎం న్యాయ సలహాదారు ఏఎస్ పొన్నన్న స్పందిస్తూ, రాజకీయ పరిచయాలతో సంబంధం లేకుండా చట్టం తన పని తాను చేస్తుందని, ఎవరైనా పాలిటిక్స్‌లో ప్రమేయం ఉంటే దర్యాప్తులో బయటపడుతుందని పేర్కొన్నారు.





