ఫార్ములా-ఈ కేసు: 8 గంటల పాటు కేటీఆర్‌ విచారణ, ఫోన్ అప్పగించాలని ఆదేశం

  • ఈ–రేసు సమయంలో వాడిన ఫోన్లను జూన్ 18లోపు సమర్పించాలని ఏసీబీ సూచన
  • “అవినీతి ఎక్కడ? అధికారులు ఒక్కటే ప్రశ్న తిరగేస్తున్నారు” – కేటీఆర్ మండిపాటు

ఫార్ములా ఈ–కార్‌ రేసు కేసులో బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఏసీబీ అధికారులు విచారణ పూర్తి చేశారు. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ కేటీఆర్‌ను ఎనిమిది గంటల పాటు ప్రశ్నించారు. విచారణ సందర్భంగా అధికారులు ఆయన్ను వాడిన సెల్‌ఫోన్ అప్పగించాలని కోరారు. అయితే, కేటీఆర్ సెల్‌ఫోన్‌ను విచారణకు తీసుకురాలేదన్నారు. దీంతో ఈ నెల 18లోపు ఫార్ములా ఈ–రేసు సమయంలో వాడిన ఫోన్లను సమర్పించాలని ఏసీబీ స్పష్టం చేసింది.

“నన్ను జైలుకెదురైతే విశ్రాంతి తీసుకుంటా” – మీడియాకు కేటీఆర్

విచారణ ముగిశాక తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్, కేసు వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని ఆరోపించారు. ‘‘అసెంబ్లీలో ఈ రేసుపై చర్చిద్దామంటే రేవంత్ పారిపోయారు. లై డిటెక్టర్‌కు సిద్ధమని చెప్పినా సమాధానం లేదు. ఏసీబీ ఒక్కటే ప్రశ్నను తిప్పి తిప్పి అడుగుతోంది. ఎక్కడ అవినీతి జరిగిందో చెప్పాలని అధికారులకే ప్రశ్న వేసా. రేవంత్ జైలుకెళ్లారు కాబట్టి మమ్మల్ని కూడా వెళ్ళాలన్నదే ప్లాన్. నన్ను జైలుకు పంపితే విశ్రాంతి తీసుకుంటా. వందల కేసులు పెట్టినా, భయపడేది లేదు’’ అని అన్నారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *