
ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో విదేశాల్లో ఉన్న తెలుగువారు భాగస్వాములు కావాలని, రాష్ట్రాభివృద్ధికి తాము పూర్తి సహకారం అందించాలన్నదే ఆశయమని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. స్విట్జర్లాండ్ జ్యూరిక్‌లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో లోకేశ్ ఈ పిలుపు నిచ్చారు.
రాష్ట్ర అభివృద్ధికి సూచనలు అవసరం
‘‘మీ సూచనలు రాజకీయంగా, అభివృద్ధిలో అత్యంత కీలకం. మేం దారి తప్పుతున్నట్లు అనిపిస్తే సరైన దారిలోకి నడిపించే బాధ్యత మీపై ఉంది. ఎన్నికల సమయంలో మీరు మాకు అండగా నిలిచినట్లు ఇప్పుడు రాష్ట్రాభివృద్ధిలో కూడా భాగస్వాములు కావాలి’’ అని లోకేశ్ విదేశాల్లో ఉన్న తెలుగువారికి పిలుపునిచ్చారు. ఐటీ, మ్యానుఫ్యాక్చరింగ్, ఆర్ అండ్ డీ కేంద్రాల ఏర్పాటు ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేసే దిశగా స్విస్ పారిశ్రామికవేత్తలను భాగస్వాములుగా కోరారు.





