యజమానికి రక్షణ గా పులితో పోరాటం!! ఆ జర్మన్ షపర్డ్ కి సలామ్ చేస్తున్న నెటిజన్లు!!

  • పులి దాడి నుంచి యజమానిని కాపాడిన వీర శునకం
  • గాయాలపాలైన శునకం, వైద్యం పొందినా ప్రాణాలు కోల్పోయింది

మధ్యప్రదేశ్‌లోని ఉమారియా జిల్లా బంధవ్‌గఢ్ టైగర్ రిజర్వ్ సమీపంలో ఓ జర్మన్ షెపార్డ్ శునకం తన యజమాని కోసం ప్రాణత్యాగం చేసింది. పులి దాడి నుంచి రక్షించేందుకు పోరాడిన శునకం, తీవ్ర గాయాల పాలై మరణించింది. శివమ్ అనే రైతు తన పొలంలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఓ పులి దాడికి ప్రయత్నించింది. ఆ సమయంలో అతడి పెంపుడు కుక్క పులిపై ఎదురుదాడికి దిగింది. కొంతసేపు ఘర్షణ జరిగిన తర్వాత పులి భయపడి పారిపోయింది. అయితే పులి పంజా గాయాలతో శునకం తీవ్రంగా గాయపడింది. గాయాలపాలైన శునకాన్ని పశువైద్యుడు అఖిలేశ్ సింగ్ వద్దకు తీసుకెళ్లగా, చికిత్స పొందినా కొద్దిసేపటికే మృతి చెందింది. పులి పంజా గాయాలు చాలా లోతుగా ఉండటంతో వైద్యం చేయగలిగినంత చేసినా ఫలితం లేకపోయింది.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *