- తన భారత్ పర్యటనలో భాగంగా లియోనెల్ మెస్సీ, అనంత్ అంబానీకి చెందిన జాంనగర్ వైల్డ్‌లైఫ్ రెస్క్యూ సెంటర్ (Vantara)ను సందర్శించారు
- అక్కడ జరిగిన మహా హారతిలో పాల్గొని, నుదుటన తిలకం ధరించి మెస్సీ తన ఆధ్యాత్మికతను చాటుకున్నారు.
- మెస్సీకి అనంత్ అంబానీ సుమారు రూ. 9 కోట్ల విలువైన ($1.1 Million) ‘రిచర్డ్ మిల్లే’ వాచ్‌ను బహుమతిగా ఇచ్చారు
ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ (Lionel Messi) తన భారత పర్యటనను జాంనగర్‌లో ముగించారు. ఇంటర్ మయామి సహచరులు లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్‌తో కలిసి అంబానీకి చెందిన వైల్డ్‌లైఫ్ సెంటర్‌ను సందర్శించారు (Messi Ambani Jamnagar Watch Gift). ఈ సందర్భంగా అక్కడ జరిగిన Maha Aarti లో మెస్సీ పాల్గొన్నారు. నుదుటన తిలకం దిద్దుకుని, విగ్రహాల పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకోవడం చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
మెస్సీ అన్ని సంప్రదాయాలను గౌరవించే తీరును ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కొనిాడుతున్నారు. గతంలో ఆయన పోప్ ఫ్రాన్సిస్‌ను కలిసిన ఫోటోలను షేర్ చేస్తూ, మెస్సీ Humility కి ఇదొక నిదర్శనమని కామెంట్స్ చేస్తున్నారు.

Anant Ambani ఖరీదైన కానుక:
వైల్డ్‌లైఫ్ సెంటర్‌లోని జంతువుల ఎన్‌క్లోజర్‌లను సందర్శించిన మెస్సీకి అనంత్ అంబానీ ఘనస్వాగతం పలికారు. ఈ పర్యటన జ్ఞాపకార్థం మెస్సీకి $1.1 Million (సుమారు రూ. 9.25 కోట్లు) విలువ చేసే Richard Mille Watch ను అనంత్ అంబానీ బహుమతిగా అందించారు.
భారతీయులు తనపై చూపించిన ప్రేమాభిమానాలకు మెస్సీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ పర్యటన భారత్‌లో సాకర్ (Soccer) పై ఆసక్తిని పెంచడమే కాకుండా, FIFA 2034 నిర్వహణ చర్చల నేపథ్యంలో దేశానికి సానుకూల అంశంగా మారింది.





