- అంతర్జాతీయ స్కేటింగ్‌లో బంగారు పతకం సాధించిన జెస్సి కాజ్
- ఒలింపిక్స్ లక్ష్యంగా ముందుకెళ్లాలని ఎంపీ సూచన
అంతర్జాతీయ స్థాయిలో స్కేటింగ్‌లో ప్రతిభ చాటుతున్న జెస్సీ రాజ్‌ను ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అభినందించారు. ఆదివారం తన తల్లిదండ్రులతో ఎంపీని మర్యాద పూర్వకంగా కలిసిన జెస్సీ, తన విజయాలను వివరించారు.
భవిష్యత్తుకు మద్దతుగా ఎంపీ హామీ
న్యూజిలాండ్‌లో జరిగిన వరల్డ్ స్కేట్ ఓషియానియా పసిఫిక్ కప్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించిన జెస్సీ, ఇటీవల రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ అందుకున్నారు. ఈ ఘనత ఏలూరు జిల్లాకు గర్వకారణమని ఎంపీ మహేష్ కుమార్ కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించేందుకు తన వంతు సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. త్వరలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని కలిసేందుకు ఏర్పాట్లు చేస్తానని తెలిపారు.






