రాష్ట్ర అభివృద్ధి కోసం కాలేజీల ఏర్పాటులో పడిన కష్టాలను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తు చేసుకున్నారు. తెలుగువారి భవిష్యత్తు కోసం దిల్లీలో అనుమతుల కోసం ఫైళ్లు పట్టుకు తిరిగిన రోజులను ఆయన గుర్తుచేశారు. స్విస్ తెలుగు డయాస్పోరా సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు, ‘‘రాష్ట్రంలో ఇంజినీరింగ్, వైద్య కళాశాలలు ఏర్పాటుతోనే మీరంతా ప్రపంచవ్యాప్తంగా రాణించగలుగుతున్నారని’’ అన్నారు.
‘‘మైక్రోసాఫ్ట్ సెంటర్, సత్య నాదెళ్ల విజయానికి ఇది మూలం’’
‘‘ఆ రోజుల్లో కళాశాలల కోసం దిల్లీలో అనుమతులు పొందడం అంత సులభం కాదు. వాటి అవసరాన్ని వివరించి, అనుమతులు తెచ్చుకున్నా. అప్పట్లో మైక్రోసాఫ్ట్ సెంటర్ హైదరాబాద్‌కి రావడంలో చేసిన కృషి సత్య నాదెళ్ల లాంటి వారిని ప్రపంచస్థాయి నాయకులుగా నిలిపింది. అందరూ కలిసి తెలుగుజాతి అభివృద్ధి కోసం పనిచేయాలని నా ఆశయం,’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.





