- సీఎం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేరిక
- ఉండవల్లి నివాసంలో పార్టీ కండువా కప్పిన చంద్రబాబు
వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఆళ్ల నాని తెలుగుదేశం పార్టీలో చేరారు. సీఎం చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జరిగింది. ఆళ్ల నానిని అధికారికంగా పార్టీలోకి ఆహ్వనించే ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, మంత్రి పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, పార్టీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, సీనియర్ నేత సుజయ్ కృష్ణ రంగారావు కూడా ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. ఆళ్ల నాని టీడీపీలో చేరికతో ఏలూరు జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారనున్నాయనే ప్రచారం మొదలైంది. గతంలో వైఎస్సార్సీపీ తరపున పని చేసిన ఆళ్ల నాని, పార్టీపై అసంతృప్తితో కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. ఆయన టీడీపీతో కలవడం వలన జిల్లాలో పార్టీ బలపడనుందా? అనే చర్చ ప్రారంభమైంది.





