గోషామహల్ స్టేడియంలో 2 వేల పడకల సామర్థ్యంతో కొత్త ఆసుపత్రి నిర్మాణం. రూ.2500 కోట్లతో అత్యాధునిక వైద్యసౌకర్యాలు, రోబోటిక్ సర్జరీలు అందుబాటులోకి
ఉస్మానియా ఆసుపత్రిని (Osmania Hospital) ఆధునికంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ నిర్వహించనున్నారు. 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో, 26 ఎకరాల భూమిపై రూ. 2500 కోట్ల వ్యయంతో ఈ ఆసుపత్రి రూపుదిద్దుకోనుంది. కార్పొరేట్ స్థాయిలో వైద్యసదుపాయాలు, ప్రతి విభాగానికి ప్రత్యేక ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూ వార్డులు ఏర్పాటు చేయనున్నారు. ఈ కొత్త భవనం రాబోయే వందేళ్ల వైద్య అవసరాలను తీర్చేలా ఉండనుంది. రోజుకు 5 వేల మంది ఓపీ రోగులకు వైద్యం అందేలా ఏర్పాటు చేస్తున్నారు. 30 విభాగాలతో రోబోటిక్ సర్జరీలు అందుబాటులోకి రానున్నాయి. ఆసుపత్రి ప్రారంభం తర్వాత 20% వైద్యుల సంఖ్య పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది.






