పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ సరిహద్దులో అలజడి: LOC వెంబడి కాల్పులు, బందిపొరాలో ఎన్‌కౌంటర్!

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఏప్రిల్ 22, 2025న జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడంతో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో నియంత్రణ రేఖ (LOC) వెంబడి పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి, గురువారం అర్ధరాత్రి నుంచి పలు చోట్ల కాల్పులకు పాల్పడింది. భారత సైన్యం ఈ దాడులను సమర్థంగా తిప్పికొడుతూ దీటుగా సమాధానమిస్తోంది. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం లేదని, గాయాలు కూడా లేవని భారత సైన్యాధికారి ఒకరు తెలిపారు. అయితే, ఈ ఘటనతో సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. ఇదే సమయంలో బందిపొరా జిల్లా కుల్నార్ బజిపొరా ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్ జరుగుతోంది. నిఘా సమాచారంతో భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టగా, ఉగ్రవాదులు కాల్పులకు దిగడంతో ఈ ఎన్‌కౌంటర్ మొదలైంది.

పహల్గాం దాడి తర్వాత పాకిస్థాన్ ఉగ్రవాదానికి మద్దతిచ్చే వైఖరిని వీడకపోతే, భారత్ నుంచి గట్టి సమాధానం ఉంటుంది. సరిహద్దులో కాల్పులైనా, ఉగ్ర దాడులైనా, మేం సిద్ధంగా ఉన్నాం!” – భారత సైన్యాధికారి.

ఈ ఉద్రిక్తతల నడుమ భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది శుక్రవారం జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్, ఉదమ్‌పూర్‌లలో పర్యటించి, 15వ కార్ప్స్ కమాండర్, రాష్ట్రీయ రైఫిల్స్ అధికారులతో సమావేశమై భద్రతా పరిస్థితిని సమీక్షించనున్నారు. పహల్గాం దాడి, LOC వెంబడి కాల్పుల విరమణ ఉల్లంఘనల నేపథ్యంలో ఈ సందర్శనం కీలకం. భారత్ ఇప్పటికే సింధూ జలాల ఒప్పందం అమలును నిలిపివేసి, అటారీ-వాఘా సరిహద్దును మూసివేసి, పాక్ హైకమిషన్ సిబ్బందిని 55 నుంచి 30కి తగ్గించి, SAARC వీసా మినహాయింపును రద్దు చేసింది. దీనికి ప్రతిగా పాకిస్థాన్ సిమ్లా ఒప్పందంతో సహా ద్వైపాక్షిక ఒప్పందాలను పక్కన పెట్టి, భారత విమానాలకు తమ గగనతలంలో నిషేధం విధించింది. ఈ చర్యలతో రెండు దేశాల మధ్య దౌత్య, సైనిక ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (365 x 270 area)
Breaking News
కేటగిరి

మా న్యూస్ అప్డేట్లు కోసం సబ్‌స్క్రైబ్ చేయండి!

Everyday we discover real news for you.