- విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారన్న ఆరోపణలు
- అన్నమయ్య జిల్లా కోర్టు రిమాండ్ విధింపు
వైకాపా నేత, సినీ నటుడు పోసాని కృష్ణమురళికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కులాలు, సినీ అభిమానులు, రాజకీయ పార్టీల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించారంటూ పోసానిపై జనసేన నాయకుడు జోగినేని మణి ఫిర్యాదు చేశారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. పోసాని తరఫున అడ్వకేట్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి 41ఏ నోటీసుల ప్రకారం బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరగా, మెజిస్ట్రేట్ తిరస్కరించి రిమాండ్ విధించారు. మార్చి 12 వరకు పోసాని కడప జైల్లో ఉండే అవకాశం ఉంది.





