- చంద్రబాబు, పవన్, లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్ట్
- రైల్వేకోడూరు కోర్టులో హాజరుపరిచే అవకాశం.. పోసానిపై విచారణ సాగుతోంది
సినీ నటుడు పోసాని కృష్ణమురళి పై అనుచిత వ్యాఖ్యల కేసు నమోదైంది. మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని నివాసంలో అరెస్ట్ చేసిన పోలీసులు, అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోసాని స్టేట్‌మెంట్ రికార్డు చేసిన తర్వాత రైల్వేకోడూరు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.
పోసానిపై పెట్టిన సెక్షన్లు:
- 196, 353(2), 111 రెడ్ విత్ 3(5)
చెన్నరాజుపోడు మాజీ సర్పంచ్ జోగినేని మణి ఫిర్యాదుతో కేసు నమోదైంది. పోలీసులు 7 గంటలుగా విచారిస్తున్నా, పోసాని సహకరించడం లేదని చెబుతున్నారు. రైల్వేకోడూరు కోర్టు ప్రాసిక్యూటర్, ప్రభుత్వ లాయర్లు విచారణ కోసం ఓబులవారిపల్లి పీఎస్‌కి చేరుకున్నారు.





