రష్మీకి అనారోగ్యం.. శస్త్రచికిత్స తర్వాత ఏం చేస్తోంతో తెలుసా!?

యాంకర్ రష్మీ గౌతమ్ ఇటీవల తీవ్ర అనారోగ్యంతో బాధపడింది. రక్తస్రావం, భుజం నొప్పి సమస్యలు తలెత్తాయి. అయితే, గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్‌ను శస్త్రచికిత్స ద్వారా తొలగించారు. ఏప్రిల్ 18న ఆపరేషన్ జరిగిందని రష్మీ సోషల్ మీడియాలో పేర్కొంది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం తాను క్షేమంగా ఉన్నానని చెప్పింది. డాక్టర్ల సూచనతో మూడు వారాలు విశ్రాంతి తీసుకుంటోంది.

“శస్త్రచికిత్స తర్వాత క్షేమంగా ఉన్నా. బాలిలో ఫ్రెండ్స్‌తో సేద తీరుతున్నా!” – రష్మీ గౌతమ్.

రష్మీ పనికి బ్రేక్ ఇచ్చి బాలి దీవుల్లో విహారం చేస్తోంది. ఫ్రెండ్స్‌తో కలిసి పండ్లు, కేక్‌లు ఆరగిస్తోంది. అంతేకాదు, డాక్టర్ సూచించిన మందులను క్రమం తప్పకుండా వేసుకుంటోంది. ఈ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో, “రెండు నెలల క్రితం ఈ ట్రిప్‌ ప్లాన్ చేశాం. ఆటలు, పాటలతో ఎంజాయ్ చేయాలనుకున్నాం. కానీ, ఇప్పుడు తినడం, పడుకోవడం, విశ్రాంతితో సరిపెట్టుకుంటున్నాం. బహుశా దేవుడు జీవితంలో అన్నీ నేర్చుకోమని ఇలా చేస్తాడేమో!” అని క్యాప్షన్‌లో రాసింది.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *