బోర్డర్-గావస్కర్ ట్రోఫీ అనంతరం, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడా? ఆస్ట్రేలియాతో సిడ్నీ మ్యాచ్ తర్వాత తన నిర్ణయాన్ని వెల్లడించనున్నాడా? క్రికెట్ వర్గాల్లో ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. సారథిగా, బ్యాటర్‌గా రోహిత్ శర్మ తీవ్రంగా విఫలమవుతున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో 3-0తో వైట్‌వాష్‌కు గురైన టీమ్, ఆస్ట్రేలియాలో కూడా నిరాశను చవిచూస్తోంది.
మెల్‌బోర్న్ టెస్టులో రోహిత్ శర్మ 3, 9 పరుగులు మాత్రమే సాధించి తన రెగ్యులర్ స్థానంలో ఆకట్టుకోలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా 184 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో, రోహిత్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి, మరియు త్వరగా రిటైర్ కావాలని సూచనలు వస్తున్నాయి. అయితే, సిడ్నీ టెస్టు ముగిసిన తర్వాత తన రిటైర్మెంట్‌పై నిర్ణయం తీసుకునేందుకు రోహిత్ సిద్ధమైనట్లు సమాచారం.





