సంక్రాంతి పండగ కోసం ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు:సాధారణ ఛార్జీలే వసూలు!!

సంక్రాంతి పండగను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ) ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. జనవరి 8 నుంచి 13 వరకు తెలంగాణ సహా ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెచ్చినట్లు ఆర్టీసీ ఎండీ ప్రకటించారు. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు 2,153 బస్సులు, బెంగళూరు నుంచి 375, విజయవాడ నుంచి 300 ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని వివరించారు.

తిరుగు ప్రయాణానికి సౌకర్యం
సంక్రాంతి అనంతరం తిరుగు ప్రయాణానికి జనవరి 16 నుంచి 20 వరకు 3,200 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ప్రకటించారు. ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలే వసూలు చేస్తామని, ప్రయాణికులందరికీ సురక్షితమైన, సౌకర్యవంతమైన సేవలు అందిస్తామని పేర్కొన్నారు.

రాయితీతో ముందస్తు బుకింగ్‌
ప్రయాణికులు ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకోవచ్చని, ఒకేసారి రెండు వైపులా టికెట్లు బుక్ చేసుకుంటే 10 శాతం రాయితీ పొందవచ్చని తెలిపారు. APSRTC Online Booking సౌకర్యం ద్వారా టికెట్లు బుక్ చేసుకునే విధానం సమకూర్చినట్లు తెలిపారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *