- రతన్ టాటా సన్నిహితుడు శంతను నాయుడు, టాటా మోటార్స్‌లో జనరల్ మేనేజర్‌గా నియమితం.
- ‘‘రతన్ టాటా నడిచొచ్చిన మార్గంలో ఇప్పుడు నేను నడుస్తున్నా’’ అంటూ భావోద్వేగ పోస్ట్.
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా (Ratan Tata) జీవిత చరమాంకంలో ఆయనతో అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తి శంతను నాయుడు (Shantanu Naidu)కి టాటా మోటార్స్ (Tata Motors)లో స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్‌కు జనరల్ మేనేజర్ పదవి లభించింది. 2018 నుంచి రతన్ టాటాకు అసిస్టెంట్‌గా పనిచేస్తూ విశ్వాసపాత్రుడిగా మారిన శంతను, తాజాగా ఈ బాధ్యతను స్వీకరించారు.
రతన్ టాటా పట్ల శంతను భావోద్వేగం
ఈ విషయాన్ని లింక్డ్ఇన్లో షేర్ చేసిన శంతను, ‘‘టాటా మోటార్స్ ప్లాంట్ నుంచి తెల్ల షర్టు, నేవీ బ్లూ ప్యాంట్లో నా తండ్రి (రతన్ టాటాను ఉద్దేశిస్తూ) ఇంటికి వచ్చేవారు. నేను కిటికీలో నుంచి ఆయన కోసం ఎదురుచూస్తూ ఉండేవాడిని. ఇప్పుడు నేను అదే మార్గంలో నడిచొచ్చే రోజులు వచ్చాయి’’ అంటూ రాశారు. గతేడాది అక్టోబరులో రతన్ టాటా తుదిశ్వాస విడిచినప్పుడు, శంతను తీవ్ర భావోద్వేగానికి గురై, ‘‘మీ నిష్క్రమణతో మన స్నేహంలో శూన్యం మిగిలింది…’’ అంటూ పోస్ట్ పెట్టారు.





