పహల్గామ్ దాడి: సౌరవ్ గంగూలీ వ్యాక్యలు.. పాక్ తో క్రికెట్ సంబంధాలు వద్దు!

పహల్గామ్ ఉగ్రదాడి భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఈ దాడిలో 26 మంది పర్యాటకులు మరణించారు. దీంతో, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్‌తో క్రికెట్ సంబంధాలను పూర్తిగా తెంచుకోవాలని బీసీసీఐకి సూచించాడు. అయితే, 2008 తర్వాత భారత్ ఒక్కసారి కూడా పాక్‌లో పర్యటించలేదు. 2013లో పాక్ భారత్‌లో ఆడింది. ఇదిలా ఉంటే, ద్వైపాక్షిక సిరీస్‌లు నిలిచిపోయాయి. ఐసీసీ ఈవెంట్స్, ఆసియా కప్‌లోనే ఇరు జట్లు తలపడుతున్నాయి.

వంద శాతం పాక్‌తో సంబంధాలు తెంచాలి. కఠిన చర్యలు తప్పవు. ఇలాంటివి జోక్ కాదు. ఉగ్రవాదాన్ని సహించలేం!” – సౌరవ్ గంగూలీ.

బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించారు. భవిష్యత్తులో ద్వైపాక్షిక సిరీస్‌లు ఉండవని చెప్పారు. ఐసీసీ నిబంధనల ప్రకారం ఆడుతున్నామని అన్నారు. అంతేకాదు, భారత ప్రభుత్వ ఆదేశాలను ఫాలో చేస్తామని తెలిపారు. ఈ దాడిని క్రీడా లోకం ఖండించింది. సచిన్ టెండూల్కర్ బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపాడు. విరాట్ కోహ్లి న్యాయం జరగాలని కోరాడు. విజేందర్ సింగ్ సైనికులు గట్టి జవాబిస్తారని చెప్పాడు. పీవీ సింధు దేశం అంతా బాధితులకు అండగా ఉందని అన్నారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *