- సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ తొమ్మిది నెలలుగా ISSలో చిక్కుకుపోయారు
- క్రూ-10 మిషన్ ద్వారా తిరిగి భూమికి రప్పించేందుకు నాసా చర్యలు
భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ త్వరలోనే భూమి మీద అడుగు పెట్టబోతున్నారు. అంతరిక్ష కేంద్రం (ISS)లో ఆమె తొమ్మిది నెలలుగా ఉండిపోయారు. ఇటీవలే అమెరికా అధ్యక్షుడిగా తిరిగి బాధ్యతలు చేపట్టిన ట్రంప్, నాసా, ఎలన్ మస్క్‌లకు తక్షణమే సునీతా విలియమ్స్‌ను రప్పించాలనే ఆదేశాలు ఇచ్చారు. దీనికోసం నాసా-స్పేస్‌ఎక్స్ కలిసి క్రూ-10 మిషన్‌ను ప్రారంభించాయి. 2024 జూన్‌లో క్రూ-9 మిషన్‌లో భాగంగా అంతరిక్ష ప్రయాణం చేసిన సునీతా, బచ్ విల్మోర్ ISSలోనే చిక్కుకుపోయారు. డ్రాగన్ క్యాప్సుల్ ద్వారా క్రూ-10 మిషన్‌లో నికోల్ అయర్స్, టకుయా ఒనిషి, కిరిల్ పెస్కోవ్ వంటి వ్యోమగాములు ISSకు చేరుకోగా, సునీతా మార్చి 19న భూమికి తిరిగి బయల్దేరనున్నారు. వీలైతే మరో వారం రోజుల్లో భూమిపై అడుగు పెట్టే అవకాశం ఉంది.





