- తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, జోగి రమేష్, దేవినేని అవినాష్‌కు ముందస్తు బెయిల్
- సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు
టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, జోగి రమేష్, దేవినేని అవినాష్ సహా 24 మందికి సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ సుధాంశు దులియా ధర్మాసనం విచారణకు సహకరించాలని సూచిస్తూ షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా బెయిల్‌కు వ్యతిరేకంగా వాదనలు వినిపించారు. అయితే, ఈ కేసుపైనే ఎందుకు ప్రత్యేక శ్రద్ధ అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
పిటిషనర్ల వాదనలు
పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. ‘‘ఇది పూర్తిగా రాజకీయపరమైన కేసు. దాడికి పాల్పడ్డ 30 మందికి ఇప్పటికే హైకోర్టు రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది. మా క్లయింట్లు ఘటన జరిగిన రోజున అక్కడ లేరు. వీరి ప్రమేయంపై ఆధారాలు లేవు’’ అని తెలిపారు. ఈ కేసులో సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి, న్యాయవాది అల్లంకి రమేష్ కూడా పిటిషనర్ల తరఫున వాదనలు వినిపించారు.





