చదువుతో ఫుట్‌పాత్ నుంచి ఫైవ్ స్టార్ హోటల్‌కు!

  • టీ అమ్ముతూ 25 పుస్తకాలు రాసిన లక్ష్మణ్‌రావు.
  • 63 ఏళ్ల వయసులో ఎంఏ పూర్తి చేసి అందరికీ ఆదర్శం.

మహారాష్ట్రకు చెందిన లక్ష్మణ్ రావు టీ అమ్ముతూనే పట్టుదలతో చదివారు. 40 ఏళ్ల వయసులో 12వ తరగతి, 50 ఏళ్లకు బీఏ, 63 ఏళ్లకు ఎంఏ పూర్తి చేశారు. 25 పుస్తకాలు రాసి ఫుట్‌పాత్ టీ దుకాణం నుంచి ఫైవ్ స్టార్ హోటల్ టీ కన్సల్టెంట్‌గా ఎదిగారు. చదువు జ్ఞానంతో పాటు గౌరవాన్ని, విజయాలను అందిస్తుందని ఆయన నిరూపించారు. 1952లో అమరావతిలోని ఓ మారుమూల గ్రామంలో జన్మించిన లక్ష్మణ్ రావు ఆర్థిక ఇబ్బందులతో పదో తరగతి తర్వాత చదువు ఆపేశారు. మిల్లు మూతపడడంతో 1975లో ఢిల్లీకి వెళ్లారు. అక్కడ హోటల్‌లో పనిచేస్తూ, ఫుట్‌పాత్‌పై టీ దుకాణం పెట్టారు. టీ అమ్ముతూనే చదువు కొనసాగించారు. ఆయన రాసిన వ్యాసం హాంకాంగ్‌లో ప్రచురితం కాగా, షాంగ్రి లా హోటల్ వైస్ ప్రెసిడెంట్‌కు నచ్చడంతో ఆయనను టీ కన్సల్టెంట్‌గా నియమించారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *