- ఈటీవో మోటార్స్, ఫ్లిక్స్ బస్ ఇండియా విద్యుత్తు బస్సులు ప్రారంభం
- ప్రారంభంలో నాలుగు వారాల పాటు రూ.99కే హైదరాబాద్-విజయవాడ ప్రయాణ అవకాశం
తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ వాహనాలను ప్రోత్సహిస్తోందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈటీవో మోటార్స్, ఫ్లిక్స్ బస్ ఇండియా భాగస్వామ్యంతో విద్యుత్తు బస్సులను గురువారం హైదరాబాద్‌లో ప్రారంభించారు. మొదటి దశలో మూడు, నాలుగు వారాల తర్వాత హైదరాబాద్-విజయవాడ మార్గంలో ఈవీ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. తర్వాత విజయవాడ-విశాఖపట్నం మార్గంలోనూ ప్రారంభిస్తామని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. సేవలు ప్రారంభమైన అనంతరం తొలి నాలుగు వారాల పాటు హైదరాబాద్-విజయవాడ ప్రయాణానికి కేవలం రూ.99 ఛార్జ్ మాత్రమే ఉంటుందని తెలిపారు. 49 మంది ప్రయాణించే సదుపాయంతో బస్సులు రూపొందించామని, భవిష్యత్‌లో స్లీపర్ కోచ్‌లను అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు.





