- ఫ్లోరిడాలో కారు ప్రమాదం.. తల్లి, కుమారుడు, అత్త మృతి
- తెలంగాణ రంగారెడ్డి జిల్లాకు చెందిన ప్రణీత రెడ్డి కుటుంబంపై విషాదం
అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలుగువారు ప్రాణాలు కోల్పోయారు. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3 గంటలకు ఈ దుర్ఘటన జరిగింది. మృతులు రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలం టేకులపల్లికి చెందిన ప్రణీత రెడ్డి (35), ఆమె కుమారుడు అరవింద్ (6), అత్త సునీత (56) గా గుర్తించారు.
కుటుంబంలో తీవ్ర విషాదం
సిద్దిపేటకు చెందిన రోహిత్ రెడ్డితో వివాహమైన ప్రణీత, ఇద్దరు కుమారులతో కలిసి అమెరికాలో నివసిస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో రోహిత్ రెడ్డి కారు నడుపుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ప్రణీత, పెద్ద కుమారుడు హర్వీన్, అత్త సునీత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రోహిత్, చిన్న కుమారుడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన టేకులపల్లిలో విషాదాన్ని నింపింది.





