- మెడికల్ గ్రౌండ్స్పై బెయిల్ కోరిన వంశీ
- వెన్నుపూస నొప్పి, ప్రత్యేక సదుపాయాల కోసం కోర్టుకు విజ్ఞప్తి
కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీ బెయిల్ కోసం విజయవాడ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆరోగ్య సమస్యల కారణంగా మెడికల్ గ్రౌండ్స్పై బెయిల్ మంజూరు చేయాలని కోరారు. అదనంగా, జైల్లో వెన్నుపూస నొప్పి సమస్య ఉండటంతో బెడ్ సదుపాయం కల్పించాల్సిందిగా, ఇంటి నుంచి ఆహారం తీసుకునే అనుమతి ఇవ్వాలని కూడా మరో పిటిషన్లో పేర్కొన్నారు. ఇప్పటికే వంశీని కస్టడీకి తీసుకోవాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నేడు వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్, పోలీసుల కస్టడీ పిటిషన్పై విచారణ జరగనుంది. గన్నవరం టీడీపీ కార్యాలయంలో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ కిడ్నాప్, దాడి కేసులో వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేసి విజయవాడ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే.





