- విడిపోతున్నారనే వార్తల నడుమ కోర్టు తీర్పు
- సోషల్ మీడియా పోస్ట్‌తో వీరి విభేదాలు బహిర్గతం
భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ విడాకులు తీసుకున్నారని ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. ముంబయిలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు వీరి విడాకులకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. ఈ వార్తల నడుమ ధనశ్రీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ గుర్తుండిపోయే పోస్టు చేసింది. “ఒత్తిడిని భగవంతుడి ఆశీర్వాదంగా మార్చుకోవాలి” అంటూ ఆమె రాసిన సందేశం, విడాకుల ప్రచారాన్ని మరింత బలపరిచింది. చాహల్ కూడా భగవంతుడి దయతో కష్టకాలంలో బయటపడ్డాను అంటూ పోస్టు చేయడం నెటిజన్లలో ఆసక్తి రేకెత్తించింది. వీరి విడాకుల కేసుపై గురువారం ముంబయి కోర్టులో తుది విచారణ జరిగింది. 45 నిమిషాల కౌన్సెలింగ్ తర్వాత, వీరు విడిపోవడానికే నిర్ణయించుకోవడంతో కోర్టు తీర్పు వెలువరించినట్లు సమాచారం. 2020లో పెళ్లైన ఈ జంట సోషల్ మీడియాలో బాగా యాక్టివ్. కానీ, ఇటీవల ఒకరినొకరు అన్‌ఫాలో చేయడం, ధనశ్రీ తన పేరులోనుంచి ‘చాహల్’ అనే పదాన్ని తీసివేయడం వీరి మధ్య విభేదాలపై ఊహాగానాలకు కారణమయ్యాయి.





