అల్లు అర్జున్‌కు చిక్కడపల్లి పోలీసులు నోటీసులు!?

సినీనటుడు అల్లు అర్జున్ కు చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. డిసెంబరు 4న సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆయనను ప్రశ్నించనున్నారు. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఈ కేసుకు సంబంధించి 18 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు, ఇందులో అల్లు అర్జున్ 11వ నిందితుడిగా ఉన్నారు. డిసెంబరు 13న ఆయన్ను అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టగా, న్యాయస్థానం రిమాండ్ విధించింది. అనంతరం రూ.50 వేల వ్యక్తిగత పూచీకత్తుతో నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. ఈ క్రమంలో, అల్లు అర్జున్‌కు మరోసారి నోటీసులు జారీ చేసిన పోలీసులు, తొక్కిసలాట ఘటనపై మరింత లోతుగా విచారించే అవకాశముంది.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (365 x 270 area)
Breaking News
కేటగిరి

మా న్యూస్ అప్డేట్లు కోసం సబ్‌స్క్రైబ్ చేయండి!

Everyday we discover real news for you.